వైల్డ్ కార్డ్ ఎంట్రీ: భారీ సర్ ప్రైజ్ ఉండబోతోందా?

0

బిగ్ బాస్ 3 టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో లేకపోయినా ఆదరణకు మాత్రం కొదవేమీలేదు. హౌస్ లో ఎలాంటి పరిణామాలు సాగుతున్నాయి.. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే అంశాలపై సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతుండడం గమనార్హం. ఇక ఎలిమినేషన్స్ లో మాత్రం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మిస్ అవుతోంది. నిన్న హౌస్ నుంచి సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఎపిసోడ్ ప్రసారం కాకముందే అందరికీ తెలిసిపోయింది .

ఇదిలా ఉంటే హౌస్ లోకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికి దక్కుతుందనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత కొద్దిరోజులగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో వినిపిస్తున్న పేర్లు రెండు. అందులో ఒకరు ఈషా రెబ్బా కాగా మరొకరు శ్రద్ధా దాస్. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ తగ్గిందని.. ఈషా లాంటి హీరోయిన్లతో ఆ లోటు తీరుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై హీరోయిన్ వస్తుందని ప్రచారం సాగుతున్నా ఒక హీరోను తీసుకొచ్చి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది.

ఏదేమైనా బిగ్ బాస్ షో రక్తి కట్టేది చివరి దశలోనే అన్నది అందరికీ తెలిసిన విషయం. ఒక్కొక్క హౌస్ మేట్ బయటకు వెళ్ళేకొద్దీ మిగతా హౌస్ మేట్స్ పై ప్రెజర్ పెరుగుతుంది..పోటీ కూడా తీవ్రమవుతుంది. ఈ దశలోనే ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుందో వేచి చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home