బిగ్ బాస్ 3 : ఛీ గలీజోడు నాకొద్దు – పునర్నవి వాఖ్యలు

0

బిగ్ బాస్ 3 సీజన్ ప్రేక్షకులందరికీ ఒకరకమైన ఆనందాన్ని కల్పిస్తుందనేది వాస్తవం. కానీ ఈ ఇంటిసభ్యుల మధ్యన మాత్రం రోజుకో గొడవ జరుగుతుంది. కాగా అవి కొందరు సీరియస్ గా తీసుకుంటున్నారు, మరికొందరైతే వదిలేస్తున్నారు. కాగా ఎప్పటినుండో ఈ ఇంటి సభ్యులైన రాహుల్, పునర్నవి మధ్యన ఎదో జరుగుతుందని అందరు అనుకుంటున్నారు. ఈ విషయమై నాగార్జున కూడా వీరిని ప్రశ్నింనప్పటికీ వారి మధ్యన ఉన్నది కేవలం స్నేహమే కానీ అంతకు మించి ఏమి లేదని అంటున్నారు వీరు. కానీ వీరి ప్రవర్తన చూస్తే వీరి మధ్యన ఉన్నది ప్రేమ అని చూసే ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు తెలుసుకోగలుగుతున్నాడు.

కాగా గురువారం నాడు జరిగినటువంటి ఎపిసోడ్ లో మాత్రం డెటాల్ లిక్విడ్ త్వరత్వరగా అవగొడుతున్నదని పునర్నవి రాహుల్ మీద సీరియస్ అవుతూ కెప్టెన్ శ్రీముఖి కి కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా రాహుల్ ని ఒక విధంగా తిట్టింది. అయితే ఆ తిట్లు విన్న రాహుల్, వరుణ్ తో చెప్పగా అదంతా ప్రేమ అని వరుణ్ సమాధానం ఇస్తాడు. కాగా నాకెక్కడ ప్రేమ కనబడటం లేదని రాహుల్ సరదాగా వ్యాఖ్యానిస్తాడు అయితే వీరిని కలపడానికి అందరు కూడా కొత్తగా ప్రయత్నిస్తుంటే పునర్నవి మాత్రం.. ఛీ ఈ గలిజోడు నాకొద్దు అంటూ అక్కడినుండి పక్కకి జరగగా, ఆ సన్నివేశాన్ని చూసిన వారందరు కూడా నవ్వుకున్నారు.
Please Read Disclaimer