‘బిగ్ బాస్ – 4’ లో పాల్గొనబోయే సెలబ్రిటీస్…?

0

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో ‘బిగ్ బాస్’ ఒకటి. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసింది తెలుగు ‘బిగ్ బాస్ ‘ కార్యక్రమం. ఎన్నో వివాదాల నడుమ ప్రసారమైన ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి వరకు ‘బిగ్ బాస్’ మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. దీంతో అటు ప్రేక్షకుల్లో ఇటు సెలబ్రిటీస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2లో యాక్టర్ కౌశల్ మండా మరియు సీజన్ 3లలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందారు. ఈ క్రమంలో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడు స్టార్ట్ కాబోయే సీజన్ 4 కోసం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి ‘స్టార్ మా’ వారు చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నారట. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనే వారు వీరేనంటూ పలువురు సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో హీరో నందు – యాంకర్ ఝాన్సీ – సింగర్ సునీత – కమెడియన్ తాగుబోతు రమేష్ – బిత్తిరి సత్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే షో నిర్వాహకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే తాగుబోతు రమేష్ ఇటీవలే ‘జబర్థస్త్’ షోలో అడుగుపెట్టాడు. మరి ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెడతాడో లేదో చూడాలి. కాగా తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2కు నేచులర్ స్టార్ నాని సీజన్ 3కి టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. స్మాల్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది సీజన్ 3. ఇక ‘బిగ్ బాస్’ 4వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆగస్ట్ నుండి ‘బిగ్ బాస్ – 4’ కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
Please Read Disclaimer