బిగ్ బాస్: శ్రీముఖి కంటే బాబాకే ఛాన్సులు ఎక్కువా…!

0

తెలుగు పాపాలర్ రియాల్టీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నామినేషన్లో ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఎవరు టాప్-5 ఫినాలేకి వెళతారు. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారు అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే రాహుల్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5లోకి వెళ్ళిన విషయం తెల్సిందే. అయితే ప్రేక్షకులని మరింత ఉత్కంఠకు గురి చేస్తూ శుక్రవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చారు.

కరెక్ట్ గా తెల్లవారుజాము 3:30 నిమిషాలకు హౌస్ లో సైరన్ మ్రోగింది. దీంతో ఇంటి సభ్యులు ఉలిక్కిపడి లేచారు. అయితే నామినేషన్ లో ఉన్న సభ్యులు లగేజ్ సర్ధుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ సూచించాడు. దాని ప్రకారం సభ్యులు బ్యాగులు సర్దుకుని వచ్చారు. ఈ సందర్భంగా బిగ్బాస్ హౌస్ లో ఏం నేర్చుకోవాలో చెప్పాలని సూచించడంతో అందరూ తమ జర్నీ గురించి చెప్పారు.

చివరికి బిగ్ బాస్ ప్రేక్షకుల తీర్పు వచ్చిందని చెప్పి…నామినేషన్ లో ఉన్న ఐదుగురు మీద లైట్లు వేస్తూ టెన్షన్ పెట్టారు. చివరికి బాబా భాస్కర్ మీద గ్రీన్ లైట్ వెలగడంతో..ఆయన్ని ప్రేక్షకులు సేవ్ చేశారని టికెట్ టు ఫినాలే గెలుచుకుని….టాప్-5లోకి వెళ్ళారని ప్రకటించారు. దీంతో బాబా ఆనందం వ్యక్తం చేసి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకున్నారు. అయితే నామినేషన్లో శ్రీముఖి వరుణ్ అలీ శివజ్యోతి మిగిలారు.

కాకపోతే అందరికంటే ముందు శ్రీముఖినే సేవ్ అవుతుందని ఎక్కువ మంది అనుకున్నారు. ఆమెకే బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఊహించని విధంగా బాబా సేవ్ అయ్యాడు. అంటే దీని బట్టి చూస్తుంటే శ్రీముఖి కంటే బాబానే విన్నర్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫినాలే పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Please Read Disclaimer