బిగ్ బాస్: రేటింగ్స్ కోసం సరికొత్త అతిథులు

0

ఎన్నో భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమైన విషయం తెలిసిందే. హోస్ట్ కింగ్ నాగార్జున రావడంతో షో మొదట్లో మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది. అయితే ఎపిసోడ్లు గడిచేకొద్ది మొదటి రెండు సీజన్ల కంటే రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వచ్చాయి. ఏదో నాగార్జున వచ్చే శనివారం ఆదివారం ఎపిసోడ్లు పర్వాలేదనిపించాయి. అలాగే నామినేషన్ జరిగే సోమవారం ఎపిసోడ్లు కూడా బాగానే నడిచాయి. అయితే ఆ తర్వాత ఎపిసోడ్లు బాగా డల్ గా సాగాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో ఫినాలేకి వచ్చేసింది.

మరో ఆరు రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోతోంది. అయితే ఈ వారంలో మంచి టీఆర్పీ రేటింగ్స్ రాబట్టాలని బిగ్బాస్ టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే టీఆర్పీ రేటింగ్స్ పెంచేందుకు స్పెషల్ గెస్ట్ లని హౌస్ లోకి తీసుకొస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఎపిసోడ్లో యాంకర్ సుమని హౌస్ లోకి పంపారు. ఆమె ఆ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంటి సభ్యులతో సరదా టాస్క్లు చేయిస్తూ ఆకట్టుకుంది. మంగళవారం ఎపిసోడ్లో కూడా ఆమె కంటిన్యూ కానుంది. కాబట్టి ఈ రెండు రోజులు మంచి రేటింగ్స్ వచ్చే అవకాశముంది.

అలాగే ఆ తర్వాత ఎపిసోడ్లలో కూడా బిగ్ బాస్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విన్నర్ ని ప్రకటించే ఆదివారం ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ‘బిగ్ బాస్ 3’ విజేతకు చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ను అందజేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు హీరోయిన్లు అంజలి నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్సులు ఫైనల్ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. మెగాస్టార్ ఎంట్రీ ఇస్తే ఇక రేటింగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Please Read Disclaimer