ఇంకో రెండు వారాలు ఆగితే అమెజాన్ లో!

0

ఇలయదళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ తమిళనాట చక్కని వసూళ్లు సాధించిందని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే తెలుగు వెర్షన్ ‘విజిల్’ మాత్రం విజయ్ గత సినిమాల్లానే నిరాశపరిచింది. ట్రేడ్ వర్గాలు ఎంతో ఆశిస్తే.. సోసో వసూళ్లతో సరిపెట్టింది ఇక్కడ. విజయ్- నయనతార నాయకానాయికలుగా నటించిన ఈ సినిమా ఫుట్ బాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి డిజిటల్ లో అందుబాటులోకి రానుందట. బిగిల్ తమిళనాట ఫర్వాలేదనిపించింది కాబట్టి స్ట్రీమింగుకి వచ్చినా ఓకే కానీ.. తెలుగు వెర్షన్ విజిల్ కూడా అమెజాన్ లో స్ట్రీమింగుకి వచ్చేస్తుందా? అన్నది చూడాలి. మరో రెండు వారాలు ఆగితే డిజిటల్ స్ట్రీమింగ్ లో వచ్చేస్తుంది అంటే థియేటర్లకు వెళ్లే వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో..!

ఇక ఇప్పటికే డిజిటల్ రిలీజ్ విషయమై పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. కొత్త సినిమాలన్నీ నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగుకి వచ్చేస్తుంటే పంపిణీదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొన్నిసార్లు ఓవైపు థియేటర్లలో సినిమా ఆడుతుంటే మరోవైపు అమెజాన్ లో చూసే ఫెసిలిటీ వచ్చేస్తోంది. ఇదేమి చిత్రమో!!
Please Read Disclaimer