ఎన్టీఆర్ బయోపిక్ పంచ్ అలా పడిందా?

0

`మహానటి` స్ఫూర్తితో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా నటసార్వభౌమ ఎన్టీ రామారారావు బయోపిక్ ని క్రిష్ రెండు భాగాలు తెరకెక్కించి రిలీజ్ చేసారు. ఇదే సమయంలో లెజెండరీ నటుడు కత్తి కాంతారావు.. కళాతపస్వి కె. విశ్వనాథ్… లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాల బయోపిక్ లు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంతారావు జీవిత కథను రాకుమారుడు టైటిల్ తో పి.సి ఆదిత్య సెట్స్ పైకి తీసుకెళ్లారు. కె.విశ్వనాథ్ కథను `విశ్వ దర్శనం` టైటిల్ తో జనార్ధన మహర్షి తెరకెక్కించారు. టీజర్ వచ్చింది.

సుస్వరాల ఘంటసాల బయోపిక్ ని `ఘంటసాల- ది గ్రేట్` టైటిల్ తో సి.హెచ్ రామారావు సెట్స్ పైకి తీసుకెళ్లారు. అయితే ప్రాజెక్ట్ లు ప్రకటించి…ప్రారంభించి కొన్ని నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకూ మళ్లీ అప్ డేట్ లేదు. కొత్త ఏడాది సందర్భంగా చాలా కొత్త చిత్రాల ప్రకటనలతో పాటు రకరకాల అప్ డేట్స్ ను ఆ చిత్ర యూనిట్ లు అందించాయి కానీ..ఈ బయోపిక్ ల విశేషాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో అసలు ఈ బయోపిక్ ల షూటింగ్ ఎంత వరకూ పూర్తయింది. అసలు సెట్స్ లో ఉన్నాయా? లేదా? అన్న సందేహాలు సైతం ఫిలిం సర్కిల్స్ లో రెయిజ్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ తర్వాత ఈ బయోపిక్ దర్శకులంతా సందిగ్ధంలో పడ్డారని సమాచారం. స్టార్ గా…రాజకీయ నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోని సంగతి తెలిసిందే. అభిమానులు సైతం సినిమాపై పెదవి విరిచేసారు. స్క్రిప్ట్ లో ఒరిజినాలిటీ లేదని…సినిమా ఎంగేజింగ్ గా లేదని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెట్స్ లో ఉన్న బయోపిక్ ల విషయంలో ఆ దర్శకులంతా ఇలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రాసెస్ లో డిలే అవుతున్నాయని..అందుకే ఏ అప్ డేట్ రాలేదని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత? వాస్తవం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer