కంపెనీ CEO అల బర్త్ డే ట్రీట్

0

డీజే బ్యూటీ పూజా హెగ్డే స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా?.. అందానికి అందం .. ట్యాలెంటుతో పాటు దానికి లక్ కలిసొస్తే ఎలా ఉంటుందో ఈ అమ్మడిని చూసి చెప్పొచ్చు. డీజే- మహర్షి చిత్రాలతో బ్లాబస్టర్లు కొట్టింది. ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన జాన్.. బన్ని సరసన ‘అల వైకుంఠపురంలో’ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బన్ని-త్రివిక్రమ్ తో కలిసి ఆన్ సెట్స్ బిజీబిజీగా గడిపేస్తోంది పూజా.

ఇంతలోనే 13 అక్టోబర్ పూజా బర్త్ డే ట్రీట్ కి టైమొచ్చింది. ఈ ఏడాది పూజా తన 29వ బర్త్ డే జరుపుకోబోతోంది. అది కూడా ఓ తెలుగు సినిమా సెట్ లో. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సహా అల వైకుంఠపురంలో చిత్రయూనిట్ సమక్షంలోనే ఈ భామకు బర్త్ డే సెలబ్రేషన్ అదిరిపోయే రేంజులో ప్లాన్ చేశారట. ఇక ఆన్ సెట్స్ బర్త్ డే ట్రీట్ అంటే ‘అల’ పాత్రధారి బర్త్ డే అని చెప్పాలి.

టైటిల్లోనే నాయిక పేరును హైలైట్ చేశారు త్రివిక్రమ్ మరోసారి. అరవింద సమేతలో అరవిందగా నటించిన పూజాకు ఈసారి అల అనే పాత్రను కట్టబెట్టాడు. అయితే ఈసారి కంపెనీ సీఈవో అల. సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా నటిస్తోంది. ఇదివరకూ సామజవరగమన పాటను రిలీజ్ చేసినప్పుడు అందులో పూజా లుక్ రివీలైంది. అంతకుమించి సీఈవో రేంజ్ అంటే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తుందట. మరోవైపు పూజా హెగ్డే నటించిన మల్టీస్టారర్ చిత్రం హౌస్ ఫుల్ 4 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రయూనిట్ పూజాకి బర్త్ డే విషెస్ చేప్పేందుకు ప్రిపేరవుతోంది. కిలాడీ అక్షయ్.. భళ్లాలదేవ రానా.. రితేష్ దేశ్ ముఖ్ సహా కోస్టార్లు పూజాను విష్ చేయనున్నారన్నమాట.
Please Read Disclaimer