బిగ్ బాస్ 4 లోకి సత్తి!!

0

నైజాం యాస.. భాష.. ఆహార్యంతో తనకంటూ ఓ యూనిక్ స్టైల్ ని ఆపాదించుకుని మీడియాలో పాపులరయ్యారు బిత్తిరి సత్తి. ప్రముఖ వార్తా చానెళ్లలో అతడి షోలకు ఉండే క్రేజే వేరు. లక్ష పైగా పారితోషికం అందుకునే పాపులర్ యాంకర్ కం నటుడిగా బిత్తిరి గురించి చెబుతుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అతడి కంటూ మాస్ సెక్షన్ లో ఆ రేంజు ఫాలోయింగ్ కూడా ఉంది.

అన్నట్టు బిత్తిరి సత్తి పాపులర్ రియాలిటీ షో `బిగ్ బాస్`లో ఈపాటికే పార్టిసిపెంట్ గా కనిపించాల్సింది. బిగ్ బాస్ సీజన్ 1 సహా పూర్తయిన మూడు సీజన్లకు అతడిని సంప్రదించినా ఎందుకనో ఆసక్తి చూపించలేదట. అప్పటికి యాంకర్ గా కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కూడా సత్తి అంగీకరించలేదని చెప్పుకున్నారు. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 4కి బిత్తిరి అంగీకరించారని తెలుస్తోంది. అంటే నైజాం యాక్సెంట్ తో సత్తి కామెడీ షో టీవీక్షకులకు షురూ అయినట్టే. ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించిన అనుభవం సత్తికి ఉంది. అందువల్ల అతడు తన ఫ్యాన్స్ కి ఇచ్చే ట్రీట్ మరో లెవల్లో ఉంటుందనడంలో సందేహమేం లేదు.

అయితే ఇన్నాళ్లు మూడు సీజన్లుగా వెంటపడుతున్నా అంగీకరించని సత్తి ఇప్పుడే ఎందుకు అంగీకరించాడు? అంటే .. దానికి కారణం కూడా ఆసక్తికరం. ప్రస్తుతం ఓ ప్రముఖ వార్తా చానెల్ లో పని చేస్తున్న సత్తికి ఆ చానెల్ యాజమాన్యంతో విభేధాలు తలెత్తి బయటికి వచ్చేశారన్న ప్రచారం సాగుతోంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే అతడు బిగ్ బాస్ కి ఓకే చెప్పాడట. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉందింకా. బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్.. సీజన్ 2కి నాని.. సీజన్ 3కి నాగార్జున హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ప్రారంభం కానున్న సీజన్ 4కి తిరిగి ఎన్టీఆర్ బరిలో దిగే వీలుందని ప్రచారమైనా.. తారక్ ఆ మూడ్ లో ఉన్నాడా లేడా? అన్నది చెప్పలేం. ఈసారి జాక్ పాట్ ఎవరికో చూడాలి.
Please Read Disclaimer