ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్!

0

ఆయనో బ్లాక్ బస్టర్ డైరెక్టర్. కెరీర్ లో పెద్ద హిట్లు లేవు కానీ పోయినేడాదిలో ఓ క్రేజీ యూత్ హీరోతో సూపర్ హిట్ సాధించడంతో ఈయన పేరు మార్మోగిపోయింది. దీంతో ఇక స్టార్ డైరెక్టర్ అయినట్టేనని చాలామంది భావించారు. కానీ ఇప్పటివరకూ ఆ దర్శకుడి తదుపరి చిత్రం ఖరారు కాలేదు. అసలు మరో ఏడాది పాటు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

మరి ఇలా ఎందుకు జరిగింది అంటే.. ఈ దర్శకుడు పెద్ద స్టార్లతోనే తన నెక్స్ట్ సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడట. అప్పటికీ ఒక టాప్ స్టార్ కు కథ చెప్పడం.. ఆయనకు నచ్చడం లాంటివి జరిగాయి కానీ ఆ స్టార్ కు మరింత క్రేజీ ప్రాజెక్టులు.. ప్యాన్ ఇండియా డైరెక్టర్లు తగలడంతో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టారట. ఇక పెద్ద స్టార్లుఎవరూ మరో ఏడాది పాటు అందు బాటులో లేరు. వారికి నెక్స్ట్ సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. దీంతో మిడ్ రేంజ్ హీరోలతో సినిమా చేయాలని చూస్తే కూడా ఆ సినిమాలు సెట్ కావడం లేదట. కారణం ఏంటంటే ఈ దర్శకుడు దాదాపు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దర్శకుడికి ఆ స్థాయి పారితోషికం ఇచ్చుకునే మిడ్ రేంజ్ సినిమాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? దీంతో ఈ దర్శకుడికి సినిమా ఎంతకూ సెట్ కావడం లేదట.

బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత కూడా తదుపరి చిత్రం ఖరారు చేసుకోకుండా ఇలా వేచి చూడడం సరికాదని.. ఇలానే కొనసాగితే మరో రెండేళ్ళపాటు ఆయనకు సినిమా ఉండదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒకటిన్నర ఏడాది ఖాళీగా ఉన్నట్టు.. ఇంకా ఎంత కాలం సినిమాను ఫిక్స్ చేసుకోకుండా వేచి చూస్తాడో తెలియడం లేదు.
Please Read Disclaimer