కరోనాపై బాలీవుడ్ భామ పోస్టు వైరల్

0

చైనాలో పుట్టి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలని గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరడంతో కేంద్రం అప్రమత్తమైంది. తగు ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా నివారణ కోసం ఇప్పటికే కేంద్రం 100కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెల్సిందే. దేశంలో తాజాగా 50పైకి పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు కరోనా వైరస్ అంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు కరోనాపై ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో కరోనాపై పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘GUYS STOP BEING OVERCONFIDENT’ అని క్యాషన్ ఇచ్చి అభిమానులకు పలు సూచనలు చేశారు. కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ‘”కరోనాతో నాకేం కాదు అనే ఆత్మవిశాసం పనికి రాదని’’ పరణీతి తెలిపారు. అలాగే దీనిని సోషల్ మీడియాలో హైప్ అని పిలవడం మానుకోవాలని సూచించారు. కరోనా వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుందని ప్రచారం మానుకోవాలన్నారు. అదేవిధంగా వైరస్ వల్ల కలిగే మరణాలు రేటు ఎక్కువని ప్రజలకు భయాందోళనలకు గురిచేయద్దని కోరారు.

మనం వైరస్ కంటే తెలివైన వారమని అనుకోవడం మానుకోవాలని పరణీతి సూచించారు. కరోనా వైరస్ నిజమైనది.. ఇది ఒకరి నుంచి ఒకరి వస్తుందని.. దీనిని ఆపడం కష్టమని.. దయచేసి ఇలాంటి విషయాల్లో స్మార్ట్ గా ఆలోచించాలని పరిణీతి చోప్రా సూచించారు. పరణీతి చొప్రా పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసినందుకు అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.

గతేడాదికి పరణీతి చొప్రా నుంచి సినిమా రాలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు అర్జున్ కపూర్ కు జోడీగా ఓ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించనుంది. హాలీవుడ్ చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ హిందీ రీమేక్లో పరిణీతీ చొప్రా కనిపించనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-