బీజేపీ పై ఫైర్ అయినందుకు ఆమెకు అవకాశాలు రావట్లేదా…?

0

ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేసినా వాళ్ళని కోర్టు కేసులు అంటూ తిప్పుతున్నారని అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైళ్లలో పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు పెట్టడాన్ని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. అంతేకాదు మోడీ ప్రభుత్వం దేశాన్ని నియంత పాలనలోకి తీసుకుపోయిందని దేశంలో స్వేచ్ఛ కరువు అయ్యిందని మోడీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇలా ఉంటే… తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ బీజేపీ గవర్నమెంట్ మీద విమర్శలు గుప్పించింది. తన అప్ కమింగ్ సినిమా ‘షీర్ కొర్మ’ సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆమె ఈ విమర్శలు చేసింది. తాను 2019 లోక్ సభ ఎలెక్షన్స్ లో ఆప్ పార్టీ సిపిఎం పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశానని చెప్పింది. ఆ టైములో తాను నాలుగు బ్రాండ్లకు యాడ్స్ చేసేదానిని అని కానీ ఆ ఎలెక్షన్ ప్రచారం తర్వాత తాను ఆ నాలుగు బ్రాండ్లని కోల్పోయానని ఆమె వాపోయింది. తానేమీ గొప్ప స్టార్ అని చెప్పట్లేదని తనకు జరిగింది మాత్రమే చెప్తున్నానని ఆమె అంటుంది.
Please Read Disclaimer