మళ్లీ తెలుగు క్లాస్ లకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ ఆలియా భట్. నెపొటిజం విమర్శలు ఎంతగా వచ్చినా కూడా ఆలియా మాత్రం అవేవి పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు నెపొటిజం టాపిక్ వచ్చినా కూడా జనాలు ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆమెపై ప్రభావం కనిపించింది. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ తగ్గడంతో పాటు ఆమెపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆ విషయాలన్నింటిని పక్కకు పెట్టి మళ్లీ తెలుగు క్లాస్ లను ఆలియా వింటోంది.ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు కమిట్ అయిన ఆలియా భట్ పాత్ర పర్ ఫెక్షన్ కోసం అంటూ తెలుగు నేర్చుకోవాలనుకుంది. ఈ ఏడాది ఆరంభంలో కొన్ని రోజులు ఆన్ లైన్ తెలుగు పాఠాలను ఆలియా విన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు ఆలియా తెలుగు పాఠాలు పక్కకు పెట్టింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్స్ లేని కారణంగా తెలుగు పాఠాలు వింటుందట.

రామ్ చరణ్ కు జోడీ పాత్రలో సీతగా ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించబోతుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అవ్వడం వల్ల తెలుగు నేర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఆలియా తెలుగు నేర్చుకుంటోంది. ఆలియా పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer