30 ఏళ్ల క్రితం కృష్ణ క్రేజ్ ముందు బాలీవుడ్ కూడా చిన్న బోయింది

0

1990 నవంబర్ 11న అంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘నాగాస్త్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటించడంతో పాటు కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. నన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. కృష్ణ దర్శకత్వంలో సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఖచ్చితంగా సినిమా లాభాలను తెచ్చి పెడుతుందనే ఉద్దేశ్యంతో బయ్యర్లు సినిమాను భారీ మొత్తాలకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు మొత్తానికి ఈ సినిమా అమ్మడు పోయింది.

అన్ని ఏరియాల్లో కూడా అత్యధిక రేటు పలికిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు ఏకంగా రూ.10 లక్షల రూపాయలను టేబుల్ ఫ్రాఫిట్ గా ఇచ్చింది. 30 ఏళ్ల క్రితం 10 లక్షల రూపాయలు అంటే ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదల కాకుండానే నిర్మాతకు ఈ స్థాయిలో లాభాలు రావడం అంతకు ముందు ఎప్పుడు జరగలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు సైతం అప్పట్లో ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది లేదు అంటూ సీనియర్ సినీ విశ్లేషకుల అభిప్రాయం.

నాగస్త్రం సినిమాకు అంత పాపులారిటీ దక్కడానికి మరో కారణం అంతకు ముందే విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. అదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు కర్తవ్యం రావడంతో ఈ సినిమాపై దాని ప్రభావం పడింది. విజయశాంతి మరియు కృష్ణ నటించడంతో పాటు కృష్ణ దర్శకత్వంలో రూపొందడం వల్ల సినిమాను ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో బాలీవుడ్ కూడా చిన్నబోయేలా ఫ్రిరిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. అప్పట్లో కృష్ణ రేంజ్ అలా ఉండేది.