వారికి ప్రభాస్ అంటే మరీ ఇంత అభిమానమా?

0

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘సాహో’ టీజర్ వచ్చేసింది. సాహో టీజర్ కు అనూహ్య స్పందన దక్కింది. తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా విడుదలైన ఈ టీజర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే 30 మిలియన్ డాలర్లకు పైగా వ్యూస్ ను ఈ టీజర్ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ వర్షన్ టీజర్ దుమ్ము రేపుతోంది. సాహో హిందీ టీజర్ పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్బుతంగా వచ్చిందంటూ అభినందిస్తున్నారు.

బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో టైగన్ ష్రాఫ్ మాత్రమే మంచి కండలు కలిగి.. హల్క్ బాడీ కలిగి ఉన్నాడని అతడి తర్వాత ఇప్పుడు ప్రభాస్ కు మాత్రమే మంచి బాడీ ఉందని అంటున్నారు. బాహుబలిలో సిక్స్ ప్యాక్ చూపించిన మాధిరిగానే సాహోలో కూడా ప్రభాస్ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించాలని ఉత్తరాది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారో అదే స్థాయిలో ఉత్తరాదిన కూడా ప్రభాస్ అభిమానులను దక్కించుకున్నాడు.

బాలీవుడ్ సినీ ప్రేమికులు యాక్షన్ సినిమాలపై ఆసక్తి ఎక్కువ చూపుతు ఉంటారు. అందుకే సాహో చిత్రం అక్కడ వంద కోట్లను ఈజీగా రాబట్టగలదనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాహుబలితో వచ్చిన ఫేంతో పాటు సాహో భారీ యాక్షన్ సినిమా అవ్వడం వల్ల ప్రభాస్ బాలీవుడ్ లో పాతుకు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.