బాలీవుడ్ బ్యూటీలు.. స్టైల్ లో పోటీలు

0

బాలీవుడ్ లో యువ హీరోయిన్ల ఫ్యాషన్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. సినిమా ఫంక్షన్లు.. అవార్డు కార్యక్రమాలు.. ఫ్యాషన్ ఈవెంట్లు ఏవైనా కానివ్వండి. డిజైనర్ వేర్ డ్రెస్సులలో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఈవెంట్లే కాదు.. జిమ్ముకు పోయే సమయంలో వేసుకునే చిట్టిపొట్టి డ్రెస్సులు కూడా యమా స్టైలుగా ఉంటాయి. బాలీవుడ్ లో ఉన్న కొత్తతరం భామలు నిన్న ఇలా కనిపించారు.

జాన్వి కపూర్: తెలుపు రంగు టాప్.. అదే రంగు స్కర్ట్.. ధరించి పైనేమో ఫుల్ స్లీవ్స్.. రౌండ్ నెక్ కాలర్ ఉండే ఒక లేత అరిటాకు పచ్చ వస్త్రాన్ని ధరించి ఫ్యాషన్ ను పీక్స్ కు తీసుకుపోయింది. స్కర్టుకు వేలాడే రెండు తాళ్లు డ్రెస్ కు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఈ భామ ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా’ అనే సినిమాలో నటిస్తోంది.

అనన్య పాండే: అనన్య ప్రస్తుతం ‘పతి పత్ని ఔర్ వో’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నలుపు రంగు సెక్విన్ స్టైల్ ప్యాంట్ సూట్ ధరించి అందరిని ఆకర్షించింది.

కృతి సనన్: ‘1’ నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. ‘పానిపట్’ సినిమాలో నటిస్తోంది. ఈ భామ రోజా రంగు చీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి సూపర్ హాట్ గా కనిపించింది.

భూమి పెడ్నేకర్: నెమలి పచ్చ రంగులో ఉండే ఒక పొట్టి గౌన్ ధరించి.. డీప్ వీ-నెక్ తో హాటుగా కనిపిస్తోంది. హై హీల్స్ తో స్టైల్ ను పెంచింది. ఈమధ్య ‘సాండ్ కి ఆంఖ్’.. ‘బాలా’ లాంటి వరస సక్సెస్ లతో భూమి కెరీర్ జోరుగా ఉంది.
Please Read Disclaimer