తన బ్రెస్ట్ అండ్ బ్యాక్ బాగుండవని చెప్పిన బాలీవుడ్ బ్యూటీ…!

0

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురైన సోనమ్ మొదటి నుండి కూడా తన భావాలను నిర్భయంగా నిర్మొహమాటంగా షేర్ చేస్తూ వస్తుంది. సామాజిక అంశాలపైన.. మహిళల విషయంలో తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్స్ పెడుతూ సమస్యలు కొని తెచ్చుకుంటుంది. ముఖ్యంగా బోల్డ్ స్టేట్మెంట్స్ తో చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది సోనమ్. ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం పట్ల అందరూ నిరసనలు తెలుపుతుంటే సోనమ్ మాత్రం ”ఫస్ట్ నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో” అని ఇండైరెక్ట్ గా ఫస్ట్ ఇండియాలో జరుగుతున్న దాడులపైన.. సమస్యలపైన స్పందించమని పోస్ట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. ఇంతకముందు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ని ‘ఆంటీ’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎవరో తెలియదన్నట్లు కాఫీ విత్ కరణ్ షోలో బిహేవ్ చేసి విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా అదే షోలో ఆమె మాట్లాడుతూ ‘నిజంగా చాలా మంది హీరోయిన్స్ సర్జరీలు చేయించుకున్నారు. వాళ్లను చూడాలంటే భయమేస్తోంది’ అంటూ మాట్లాడింది. ఓ సందర్భంలో భారతీయ మగాళ్లు అందం అంటే ఏంటో తెలియాలంటే వారంతా గే అయితే తప్ప తెలియదని కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది.

అంతేకాకుండా ఈ బ్యూటీ తన బాడీ గురించి కూడా అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసింది. గతంలో ఒకసారి సోనమ్ మాట్లాడుతూ తన బ్రెస్ట్ మరియు బ్యాక్ అస్సలు బాగుండవని చెప్పుకొచ్చింది. అమ్మడు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె బ్రెస్ట్ సైజ్ గురించి చాలా విమర్శలు వినిపించాయి. దానిపై స్పందించిన సోనమ్ ఈ కామెంట్స్ చేసింది. ఇక దీపికా పదుకొణె టీమ్ కావాలనే ఆమె హీరోలతో డేటింగ్ లో ఉన్నట్టుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని.. వార్తల్లో ఉండేందుకు హీరోయిన్లే కావాలని ఇలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తుంటారని చెప్పి ఇండస్ట్రీ ప్రముఖుల ఆగ్రహానికి గురైంది సోనమ్. మరో సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన మొదటి హీరో రణబీర్ కపూర్ బాయ్ ఫ్రెండ్ గా పనిరాడని.. అసలు దీపిక అంత కాలంగా అతనితో ఎలా ఉందో అంటూ అంటూ కామెంట్స్ చేసింది. ఇలా ఎప్పుడూ ఏదొక అనవసరమైన విషయాలపైన కామెంట్స్ చేస్తూ ఉండటం సోనమ్ కి అలవాటైన పని. పెళ్ళైన తర్వాత కూడా సోనమ్ ఇలానే ట్వీట్స్ పెడుతూ వస్తోంది. ఇటీవల సుశాంత్ మరణం తర్వాత ‘నెపోటిజం’ పై జరుగుతున్న చర్చలో నెటిజన్స్ సోనమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
Please Read Disclaimer