బాలీవుడ్ భామ వెడ్డింగ్ ఎఫైర్

0

హిందీ సినిమాలు చూసేవారికి బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ పేరు తెలిసే ఉంటుంది. అక్షయ్ కుమార్ సూపర్ హిట్ ఫిలిం ‘టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథా’ లో హీరోయిన్ గా నటించింది. ‘దమ్ లగాకే హైషా’.. ‘శుభ్ మంగళ్ సావధాన్’.. ‘సొన్ చిడియా’ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న బిజీ హీరోయిన్లలో భూమి ఒకరు. ఈమధ్యే సోషల్ మీడియాలో కూడా తన హంగామా మొదలు పెట్టింది.

రీసెంట్ గా ఈ భామ వెడ్డింగ్ ఎఫైర్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ.. ఎవరో తెలుసు కదా.. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. పింక్ షేడ్ ఎక్కువగా కనిపిస్తున్న మిక్స్డ్ కలర్స్ లో ఉండే డ్రెస్ లో భూమి సూపర్ పోజు ఇచ్చింది. ఈ డ్రెస్ ను డిజైన్ చేసినవారు ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్లు శంతను నిఖిల్. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్లు కావడం వల్లేమో తెలీదు కానీ.. వినెక్ ను వీలైనంత పెద్దదిగా పెట్టారు. దీంతో భూమి ఎంతో హాటుగా మారిపోయింది. చేతికి మ్యాచింగ్ గాజులు..వేళ్ళకు ఉంగరాలు.. కళ్ళకు పింక్ కలర్ మేకప్ తో భూమి డిఫరెంట్ గా కనిపిస్తోంది. భూమి ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్ సెన్సువల్ గా ఉంది. ఎంతోమంది ఫారెన్ బ్యూటీల మధ్యలో ఇలా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకోవడం గొప్ప విషయమే కదా.

ఈ ఫోటోలకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “న్యాచురల్ బ్యూటీ”.. “పింక్ డ్రెస్ లో పర్ఫెక్ట్ హాటీ”.. “కలర్ ఫుల్ డ్రెస్.. సో అట్రాక్టివ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక భూమి సినిమాల విషయానికి వస్తే ‘సాంద్ కి ఆంఖ్’.. ‘భూత్- పార్ట్ 1: ది హాంటెడ్ షిప్’.. ‘బాలా’.. ‘పతి పత్ని ఔర్ వో’..’డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ అనే చిత్రాల్లో నటిస్తోంది.