సైరా కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ జనాలు

0

చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెలుగులో మినహా మిగిలిన భాషల్లో మొదటిరోజు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టుకోలేదు. మొత్తం దేశవ్యాప్తంగా మొదటిరోజు 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అందులో చాలావరకు తెలుగు నుండి వచ్చిన కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సినిమా 200 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు 200 కోట్ల షేర్ రాబడితేనే సినిమా మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు సేఫ్ అవుతారు.

నిర్మాత రాంచరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మార్కెట్ చాలా నిరాశ పరచింది. అక్కడ మొదటిరోజు కేవలం కోటి యాభై లక్షలు షేర్ మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇంక తమిళ – మలయాళ భాషల్లో కూడా అనుకున్నంత కలెక్షన్స్ అయితే రాలేదు. బాలీవుడ్ లో రివ్యూలు అన్నీ బాగానే వచ్చినా మొదటిరోజు కలెక్షన్స్ విషయం సినిమా యూనిట్ ను కొంచెం కలవర పెడుతుంది. సైరా తో పాటు రిలీజ్ అయినా వార్ సినిమా ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఆ సినిమాకి కూడా రివ్యూలు బాగా రావడంతో హిందీ జనాలు వార్ మూవీకి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దసరా సెలవులు ఇంకా వారం రోజులు పైగానే ఉండడంతో సైరా టాక్ బాగుంది కాబట్టి తర్వాత కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉండొచ్చు.
Please Read Disclaimer