నటి అర్చన పెళ్లి కి బాలీవుడ్ గెస్ట్!

0

తెలుగమ్మాయి.. అందాల కథానాయిక అర్చన పారిశ్రామిక వేత్త జగదీష్ ని ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఇంతకు ముందు నిశ్చితార్థ వేడుక ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసారు. అనంతరం వివాహ తేదీని ఖరారు చేశారు.

ఈనెల 14న హైదరాబాద్ లో అర్చన- జగదీష్ జంట వివాహం జరగనుంది. గచ్చిబౌలి లోని కొల్ల మాధవ రెడ్డి గార్డెన్ లో జరగనున్న ఈ వేడుక కు భారీగా బంధుమిత్రులు సహా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇప్పటికే పెళ్లి సందడి పీక్స్ కి చేరుకుంది. తొలిగా సంగీత్ కార్యక్రమం వైభవంగా జరిగింది. సంగీత్ లో నవ వధువు వరుడు డ్యాన్సులతో హుషారెత్తించారు. ఈ వేడుకలో కొత్తజంటతో పాటు స్నేహితులైన శివ బాలాజీ-మధుమిత దంపతులు ఆట పాటలతో జోష్ చూపించారు.

నవంబర్ 13 ఈవెనింగ్ విందును ప్లాన్ చేయగా.. నవంబర్ 14 వేకువఝామున పెళ్లి ఘనంగా జరగనుంది. అర్చన వివాహ మహోత్సవానికి బాలీవుడ్ నుంచి పలువురు సర్ ప్రైజ్ గెస్టులు అటెండయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ స్థానికం గా ఉన్న టాప్ సెలబ్రిటీలు ఈ వేడుక కు ఎటెండ్ అవుతున్నారట.
Please Read Disclaimer