టాలీవుడ్ బ్యాచిలర్ల గాళ్ ఫ్రెండ్ పై భాయ్ మోజేల?

0

పూజాహెగ్డే.. టాలీవుడ్ లో టాప్ హీరోల ఏకైక ఆప్షన్. ఏ స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ నోట విన్నా పూజా మాటే. యూత్ అయితే బుట్టబొమ్మ అంటూ ఆరాధిస్తున్నారు. అంతగా టాలీవుడ్ ని అభిమానుల్ని ప్రభావితం చేస్తోంది. క్రేజీ హీరోయిన్ ల కొరత వుండటంతో ప్రస్తుతం టాప్ హీరోలకు ఏకైక ఛాయిస్ గా పూజా మారిపోయింది. దీంతో ఆమెకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. లాక్ డౌన్ తరువాత అంతా తమ రెమ్యునరేషన్ తగ్గించేస్తుంటే పూజ మాత్రం ఏకంగా 3 కోట్లకు పెంచేసింది.

తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ పూజా హెగ్డే కోసం హీరోలు పోటీపడుతున్నారు. సల్మాన్ ఖాన్ చిత్రం కోసం మేకర్స్ ఇప్పటికే ఆమెని సంప్రదించారని ఇటీవల వార్తలు కూడా వినిపించాయి. ఆ తరువాత లైన్ లో వున్న హీరో రణ్ వీర్ సింగ్. ఈ హీరో న్యూ ప్రాజెక్ట్ కోసం పూజా హెగ్డేని సంప్రదించారట. పారితోషికం విషయంలో రాజీ ప్రస్తే లేదని భారీగా కోట్ చేసినట్టు తెలిసింది.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్` చిత్రంతో పాటు అఖిల్ అక్కినేని తో కలిసి `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శకనిర్మాతలు పూజాని సంప్రదిస్తున్నారు. హాట్ కేక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడంతో పూజా కూడా ఈ టైమ్ ని తెలివిగా క్యాష్ చేసేస్తోందిట. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో నటిస్తున్న పూజాకు అటు బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిందని తాజా సన్నివేశం చెబుతోంది. బ్యాచిలర్లు ప్రభాస్.. అఖిల్ నాయికపై సల్మాన్ మోజేల? అంటూ యూత్ లో ఒకటే డిస్కషన్ సాగుతోంది.