స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ క్వీన్..!

0

ఇండస్ట్రీలో తన మనసుకు ఏదనిపిస్తే అది ముఖం మీదే చెప్పేయడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీరు. అందరూ అది పొగరు అంటే కంగనా మాత్రం అది కేవలం ముక్కుసూటితనమే అంటుంది. ఆమె తీరు కొందరికి నచ్చుతుంది కానీ ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలలోకి నెట్టేస్తుంది. అలాగని తీరు మార్చుకునే రకం కాదు కంగనా. తన మాజీ బాయ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే హీరో హృతిక్ రోషన్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వివాదానికి తెరలేపింది. కంగనాకి వివాదాలు కొత్తేమీ కాదు. వీరి మధ్య ఎప్పుడు వివాదం జరిగిన ఇటు ఇండస్ట్రీలో.. అటు అభిమానుల్లో సంచలనం అవుతుంది. అయితే అమ్మడు మళ్లీ హృతిక్ రోషన్‌ను ఎందుకు టార్గెట్ చేసిందని చర్చ నడుస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీల వివాదాలలో కంగనా – హృతిక్ రోషన్ వివాదం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇటీవలే సుశాంత్ మృతి పట్ల వారసత్వం.. బంధుప్రీతి గురించి మాట్లాడిన కంగనా మాటలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా హృతిక్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ పేరు కూడా ప్రస్తావించింది. తాజాగా ఓ ఇంటర్వూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “ఒకప్పుడు నేను ‘డబ్బు – అత్యాశ’ లాంటి ట్యాగ్ లైన్లను విన్నా.. కానీ ఇప్పుడు నాకు ముంబైలో సొంత ఇల్లు.. విలాసవంతమైన ఆఫీసు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పింది. అంతేగాక మాజీ బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని..

కానీ ఆ ఇంటి అద్దెను అతని తండ్రి రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడని ఎద్దెవా చేసింది. ‘కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత నా జర్నీ సాఫీగా సాగింది. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. కొంతకాలం కిందట హృతిక్ రోషన్ తో వివాదం జరిగింది. న్యాయపోరాటం చేస్తే డబ్బులు కోసం చేస్తున్నానని చిత్రీకరించే యత్నం చేశారు. కానీ ఈరోజు నేను సొంత ఇంట్లో ఉంటున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ హృతిక్ ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి అద్దె చెల్లిస్తున్నాడు తెలుసా.. నేను డబ్బు కోసం పాకులాడటం లేదని చెప్పేందుకు ఇది చాలనుకుంటా’ అంటూ మరోసారి హృతిక్ రోషన్ లక్ష్యంగా కంగనా రనౌత్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ నెట్టింట వివాదాస్పదంగా మారుతున్నాయి.
Please Read Disclaimer