బెస్ట్ ఫీమేల్ యాక్షన్ క్వీన్?

0

క్వీన్ కంగన యాక్షన్ మోడ్ గురించి తెలిసిందే. ఆఫ్ ద స్క్రీన్.. ఆన్ ద స్క్రీన్ ఫైటింగ్ తో నిరంతరం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు నాయికా ప్రధాన చిత్రాల్ని ఎంపిక చేసుకుని భారీ యాక్షన్ కి రెడీ అవుతోంది. మరోవైపు ఆఫ్ ద స్క్రీన్ మేల్ డామినేటెడ్ ప్రపంచంపై పోరాటం సాగిస్తోంది. ఈ రెండిటా కంగన డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవలే `మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` చిత్రంలో కంగన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కంగన తప్ప వేరొకరిని ఊహించలేం అన్నంతగా ఒదిగిపోయి నటించింది. కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీలో కంగన అచ్చం రాకుమారినే తలపించిందన్న ప్రశంసలు దక్కాయి.

అటుపైనా క్వీన్ ఎంపిక చేసుకుంటున్న కథాంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం యాంజెలినా జోలీ `లారా క్రాఫ్ట్` రేంజు భారీ యాక్షన్ స్క్రిప్టుని ఎంపిక చేసుకుని అందులో నటించేందుకు ప్రిపేరవుతోంది. `ధాకడ్` అనేది ఈ సినిమా టైటిల్. ఈ చిత్రానికి రజ్ నీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కంగనతో ఇండియా బెస్ట్ ఫీమేల్ యాక్షన్ మూవీని తీస్తున్నామని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమా స్క్రిప్టు కోసం 10 నెలల పాటు కంగనతో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేశామని.. భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్న ఈ స్క్రిప్టును తను అంగీకరించడంతో సెట్స్ కెళుతున్నామని తెలిపారు. రచయితలు చింతన్ గాంధీ- రినిష్ రవీంద్రలతో పాటు కంగన స్క్రిప్టు డిస్కషన్స్ లో పాల్గొన్నారని వెల్లడించారు.

ఫిజికల్ గా హార్డ్ వర్క్ కి సంబంధించిన భారీ యాక్షన్ సినిమా ఇది. దీని కోసం హాంగ్ కాంగ్ – థాయ్ ల్యాండ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లను బరిలో దించుతున్నాం. గన్ ఫూ (ఏ మిక్స్ ఆఫ్ గన్స్ మార్షల్ ఆర్ట్స్) అనే విద్యను కంగన నేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. థాయ్ ల్యాండ్- యూరఫ్- బుడాపెస్ట్- ప్రేగ్- దుబాయ్ – అబుదబీ లాంటి చోట చిత్రీకరణ చేయనున్నాం. అలాగే ఉత్తర అమెరికాలోనూ కీలక షెడ్యూల్ ని షూటింగ్ చేస్తాం.. అని వివరాల్ని వెల్లడించారు. ఇప్పటికే కంగన ప్రీ లుక్ పోస్టర్లు అంతర్జాలంలో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. సిల్వస్టర్ స్టాలోన్ నటించిన `ఫస్ట్ బ్లడ్ `తరహాలో భారీ మెషీన్ గన్స్ ని చేతబట్టి కంగన చేస్తున్న విన్యాసాలు రక్తి కట్టిస్తున్నాయి.

ఇందులో స్లోమోషన్ గ్రావిటీ తరహా యాక్షన్ దృశ్యాల్ని చూపించం. పూర్తిగా లైవ్ యాక్షన్ మోడ్ దృశ్యాల్నే చూపిస్తామని దర్శకుడు వెల్లడించారు. ఇక పోతే ఈ చిత్రంలో భారీ యాక్షన్ దృశ్యాల్లో నటించేందుకు కంగన అన్ని విధాలా శిక్షణ పొందుతుండడం ఆసక్తిని పెంచుతోంది. మేల్ డామినేటెడ్ ప్రపంచంపై అన్ని రకాలుగా ఎటాక్ తో క్వీన్ దూసుకుపోతోందని దీనిన బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కంగన `పంగ` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తదుపరి `ధాకడ్` రెగ్యులర్ చిత్రీకరణలో పాల్గొననుంది.
Please Read Disclaimer