సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పిన గర్ల్ ఫ్రెండ్ రియా?

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సుశాంత్ ఆత్మహత్యపై అందరిలో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. సూసైడ్ చేసుకున్నాడా లేక బలవన్మరణం చేసుకునేలా ఎవరైన ప్రేరేపించారా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అయితే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు సున్నిత మనస్కుడైన సుశాంత్ ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపణలు చేసింది. సుశాంత్ సూసైడ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయట. ఇందులో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు ఇటీవలే విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో ఆమె పోలీసులకు సుశాంత్ కి సంభందించిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

సుశాంత్ నివాసముంటున్న ఇంట్లో దెయ్యం ఉందని.. అంతేగాక తాను కూడా పలుమార్లు సుశాంత్ ఇంటికి వెళ్లిన సమయంలో ఏవో అతీత శక్తులు ఉన్నట్లు గమనించానని.. ఆ విషయం గురించి సుశాంత్ తో చెప్పినప్పటికీ పట్టించుకునే వాడు కాదని పోలీసులతో రియా చక్రవర్తి చెప్పుకొచ్చిందట. అంతేకాకుండా సుశాంత్ యశ్ రాజ్ ఫిల్మ్స్ తో మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడని.. వాటిలో రెండు సినిమాలు మాత్రమే పూర్తి చేసి మరో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడని.. తనను కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ తో సినిమాలు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించాడని పోలీసులతో చెప్పిందట. తాము త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని.. చివరిగా జూన్ 6న సుశాంత్ ఇంటికి వెళ్లానని.. ఆ సమయంలో సుశాంతే స్వయంగా తనను అక్కడ్నుంచి వెళ్లిపొమ్మన్నాడని చెప్పుకొచ్చిందట. గత కొన్ని రోజులుగా సుశాంత్ డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా వాడటం బంద్ చేశాడని రియా వెల్లడించిందట.

కాగా రియా చక్రవర్తి తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ‘తూనీగ తూనీగ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది. రియా సుశాంత్ తో గత కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా చెప్పారు. రియాను ‘నా జిలేబీ’ అంటూ ఓసారి సుశాంత్ ఫొటో షేర్ చేశారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ కూడా వినిపించింది.
Please Read Disclaimer