అందమే కాదు ఆస్తి కూడా నాదే: రాధికా మదన్

0

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రాధికా మదన్. రీసెంట్ గా రిలీజైన అంగ్రేజీ మీడియం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో తన నటనతో సెలెబ్రిటీల నుండే కాదు విమర్శకుల నుండి కూడా ప్రశంసలను అందుకుంటుంది. తొలుత కొన్ని సీరియళ్లలో నటించిన ఈ భామ 2018లో విడుదలైన ‘పటాకా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఢిల్లీ నుండి తెరమీదకి వచ్చిన ఈమె అందం అభినయాలతోనే కాదు తన ఆస్తులతో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

రాధికా ఢిల్లీలో పేరు ప్రఖ్యాతలు గల సంపన్న కుటుంబం నుండి వచ్చింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తీ చేసుకొని బ్యూటీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత టెలివిజన్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సీరియళ్ల ద్వారా అవార్డులు రివార్డులు రావడంతో సినీ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన మొదటి రెండు సినిమాలు రాధికకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు.

అయితే ఆస్తుల పరంగా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో రాధికకే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రముఖ పత్రిక తెలిపింది. అక్షరాలా రాధిక పేరు మీద 7కోట్ల పైనే ఉందట. మరి సంపన్న కుటుంబం నుండి వచ్చింది కదా.. ఆ మాత్రం ఉండకపోతే ఎలా మరి అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. రాధిక రీసెంట్ గా అంగ్రేజీ మీడియం సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి బిగ్ బి అమితాబ్ నుండి కూడా ప్రశంసలు పొందింది. మరి కరోనా ఎఫెక్ట్ వల్ల రాధిక మదన్ అందాలు అందరి కళ్ళకు అందుతాయి లేదో చూడాలి. అయితే అందం అభినయం ఆస్తి రాధికా సొంతం అనొచ్చేమో కాబోలు..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-