సూపర్ స్టార్ ఇంటికి బాంబు బెదిరింపు

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘బిజిల్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా హడావుడిలో ఫ్యాన్స్ మరియు హీరో ఫ్యామిలీ ఉండగా ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విజయ్ ఇంట్లో బాంబు పెట్టాను మరికాసేపట్లో పేళబోతుంది అంటూ చెప్పాడట. దాంతో వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో బాంబు స్వ్కాడ్ కూడా విజయ్ ఇంటికి వెళ్లి అణువణువు చెక్ చేశారట. దాదాపు 30 నిమిషాల పాటు చెక్ చేసిన తర్వాత ఇంట్లో బాంబు లేదని గుర్తించారు.

విజయ్ ఇంట్లో బాంబు లేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇంట్లో ఏమైనా పెట్టి ఉంటారా అనే అనుమానంతో అక్కడకు కూడా వెళ్లి చెక్ చేశారు. అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఎవరో కావాలని ఇలా చేసినట్లుగా పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఆ ఫోన్ వచ్చిన ఏరియాలో ఎంక్వౌరీ చేయగా ఫోన్ చేసిన వ్యక్తి దొరికాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

పోలీసుల విచారణలో అతడు చాలా రకాల సమాధానాలు చెబుతున్నాడట. పొంతన లేకుండా మాట్లాడుతూ ఉండటంతో అతడు విజయ్ పై అభిమానంతోనో లేదంటే విజయ్ పై కోపంతోనో విజయ్ దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసి ఉంటాడు అనే ఉద్దేశ్యంకు వచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home