ఆ సినిమా ఆపాలంటూ కోర్టుకు బోనీకపూర్

0

ఒక సినిమా పేరు మీద ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమ్ దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు సినిమా పేరు మార్చే అంశంపై ఎంతవరకైనా సరే.. అనేందుకు సిద్ధమవుతున్నారట. ఒక సినిమా.. అందునా మలయాళం సినిమా పేరు మీద ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? ఎందుకంత సీరియస్ గా ఉన్నారన్న విషయంలోకి వెళితే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

అదేమంటే.. కన్నుగీటిన సీన్ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో సంచలనంగా మారిన వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ తాజాగా శ్రీదేవి బంగ్లా పేరుతో ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ విడుదలైంది కూడా. ఇందులో హీరోయిన్ బాత్ టబ్ లో పని చనిపోయినట్లుగా ఉండటంతో ఈ టీజర్ చాలామందిని ఆకర్షిస్తోంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ చిత్రంపై బోనీకపూర్ ఆగ్రహంతో ఉన్నారట.

శ్రీదేవి బంగ్లా దర్శక.. నిర్మాతలకు ఇప్పటికే నోటీసులు పంపిన బోనీ.. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి బంగ్లా టైటిల్ ను మార్చాలన్నది ఆయన డిమాండ్. తన భార్య పేరును దెబ్బ తీసేలా కథనం ఉందన్నది బోనీ వాదనగా చెబుతున్నారు. సినిమా టైటిల్ లో శ్రీదేవి అనే పేరు లేకుండా చేయటం మీదనే ఆయన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer