శ్రీదేవితో బోనీకపూర్ మీటింగ్!

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో పింక్ రీమేక్ ని తెరకెక్కించేందుకు బోనీకపూర్ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్- దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శరతులతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నారని వార్తలొచ్చాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో కథానాయిక ఎవరు? అంటే..

ఓ ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తోంది. పింక్ చిత్రంలో తాప్సీ చేసిన పాత్రకు పూజా హెగ్డేని ఒప్పిస్తున్నారా? అన్న సందేహం కలిగేలా బోనీ లేటెస్ట్ మీటింగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. లేదూ వేరే ఇంకేదైనా ప్రాజెక్ట్ కోసం ఇలా పూజా నిర్మాత బోనీని కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది. బోనీకపూర్ ప్రస్తుతం సౌత్ – నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా సినిమాలు తీస్తున్నారు. అందుకే ఆయనకు పూజా టచ్ లోకి వెళ్లిందని అర్థమవుతోంది.

పూజాకి.. వరుసగా మహర్షి.. గద్దలకొండ గణేష్ చిత్రాలు సంతృప్తి కరమైన ఫలితాన్నే ఇచ్చాయి. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించి మెప్పించింది. అందుకే ఇలా బోనీని కలవగానే శ్రీదేవితో బోనీ మీటింగా? అంటూ అభిమానులు సరదాగా సెటైర్ వేస్తున్నారు. ఇంతకీ ఈ మీటింగ్ సారాంశమేమిటో పూజానే చెప్పాల్సి ఉంది. బులుగు స్కర్టులో పూజా ఇచ్చిన ఎంట్రీ చూస్తుంటే చాలా స్పెషల్ గానే ఉంది మరి.
Please Read Disclaimer