స్టార్ హీరో కొడుకుకి కారు ఆక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం!!

0

బాలీవుడ్లో యాక్షన్ హీరో గోవిందా అంటే అందరికి సుపరిచితమే. యాక్షన్ సన్నివేశంలో కూడా కామెడీ పండించడంలో ఆయనకు ఆయనే సాటి. హీరో నుండి సూపర్ స్టార్ గా ఎదిగిన గోవిందా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అడపాదడపా వెండితెర పై మెరుస్తున్న ఆయన ఈ మధ్య కాలంలో కనిపించడం కరువైంది. కానీ ఒకప్పుడు గోవిందా సినిమాలు అంటే యాక్షన్ అభిమానులకు పండగే. ముఖ్యంగా యాక్షన్తో పాటు కామెడీతో ప్రేక్షకులను మెప్పించడంలో గోవిందా ఎక్సపెర్ట్ అని చెప్తుంటారు. సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. లాంటి వారే గోవిందా కామెడీకి ఫిదా అవుతామని పలుమార్లు ఒప్పుకున్నారు. ఇక గోవిందాకి ఓ కుమార్తె టీనా.. కుమారుడు యశ్వర్ధన్ ఉన్నారు.

అయితే ఇటీవలే గోవిందా కొడుకు యశ్వర్ధన్ ప్రయాణిస్తున్న కారు ముంబైలోని జుహు ప్రాంతంలో ప్రమాదానికి గురైందట. షాక్ కి గురిచేసే ఈ విషయం.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యాక్సిడెంట్ జరిగిన టైంలో యశ్వర్ధన్తో పాటు అతని డ్రైవర్ కూడా కారులో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందట. ఈ నెల 2వ తేదిన రాత్రి యశ్వర్ధన్ తనకు తెలసిన వాళ్లకు సంబంధించిన ఓ పార్టీ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జుహు వద్ద యశ్ రాజ్ ఫిల్మ్స్కు చెందిన ఫ్యార్చూన్ కారు.. యశ్వర్ధన్ కారు ఢీ కొట్టుకొనగా.. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. దీంతో ఇరు వర్గాలు ఒకరికొకరు చర్చించుకొని వాళ్ల ప్రాబ్లెమ్ను వాళ్లే పరిష్కరించుకున్నారని వినికిడి. ఈ ఘటన పట్ల పోలీసులకు కూడా పనిలేదని కేసు నమోదు చేయలేదట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గోవిందా పలు టీవీ రియాలిటీ షోలకు జడ్డ్గా వ్యవహిస్తున్నారు.
Please Read Disclaimer