పూరి.. కొరటాల సినిమాలు అడిగితే..కామ్రేడ్ దొరికాడుగా

0

తొందరపడి మాట్లాడటం విజయ్ దేవరకొండకు అలవాటు లేని పని. కాకుంటే.. మనసులోని భావాలు మాటల రూపంలో వచ్చేస్తాయన్న దానికి తగ్గట్లే ఆయన తాజా మాటలున్నాయని చెప్పాలి. తనకు తెలీకుండానే తాను మాట్లాడిన మాటలతో ఇబ్బందిని ఎదుర్కొనున్నారని చెప్పాలి.

విపరీతమైన టైట్ షెడ్యూల్ తో నాలుగు భాషల్లో విడుదల కానున్న తన తాజా మూవీ డియర్ కామ్రేడ్ కు ప్రచారం చేసే హడావుడిలో ఉన్న విజయ్ దేవరకొండ అనుకోని రీతిలో తన మనసులోని భావాన్ని బయటపడేలా మాట్లాడిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్న సందర్భంగా విజయ్ దొరికిపోయారు.

పూరి.. కొరటాల శివలతో సినిమా ఎప్పుడన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. ఇద్దరు దర్శకులకు సంబంధించిన సమాధానం మాత్రం వేర్వేరుగా ఉండటం గమనార్హం. పూరి జగన్నాథ్ తో సినిమా ఇంకా ఏమీ అనుకోలేదని.. ఆ ఆలోచన వస్తే చెబుతానన్న విజయ్.. కొరటాల శివ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. కొరటాల శివతో చేయాలని ఉందని.. ప్రస్తుతం చిరంజీవితో ఆయన సినిమా చేస్తున్నారని.. అది పూర్తి అయ్యాక ఇద్దరి వీలును బట్టి ఆలోచించాలన్న మాటను చూస్తే.. విషయం ఇట్టే అర్థం కాక మానదు.

వరుస ప్లాపులతో సతమతమవుతూ.. ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మాంచి ఊపు మీద ఉన్న పూరికి విజయ్ తాజా మాటలు షాకింగ్ గా మారే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. పూరి ట్రాక్ రికార్డుతో పోలిస్తే.. కొరటాల మెరుగ్గా ఉన్నప్పుడు.. ఎవరైనా ఎవరిని ఎంచుకుంటారు? అందులోకి తన సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అన్నట్లుండే విజయ్ తొందరపడతాడా ఏంటి?
Please Read Disclaimer