సుడిగాలి కి జబర్దస్త్ స్ట్రోక్ ఇచ్చిన బాక్స్ ఆఫీస్!

0

ఒక సినిమాలో హీరోగా నటించడం అనేది చాలామందికి కల. అయితే అందరికీ అది తీరే అవకాశం దక్కదు. వెనక డబ్బు మూలుగుతుంటే జాగ్వార్లు.. ల్యాండ్ రోవర్లు..బెంట్లీలు అంటూ ఎన్ని కాస్ట్లీ సినిమాలైనా తీసుకోవచ్చు. అయితే అది నటన రాని.. ఒంట్లో హావభావాలు వీసమెత్తు లేని బడాబాబుల సంగతి. అయితే అటు టీవీలోనో..ఇటు సినిమా ల్లోనే కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టు గా పేరు తెచ్చుకున్న వారు కూడా హీరోలుగా మారాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నటన రాని ఎంతోమంది స్టార్ కిడ్స్ కంటే వీరు చాలా మేలు. అయితే తేడా ఎక్కడ వస్తుందంటే.. కామెడీని వదిలేసి ఫక్తు కమర్షియల్ హీరోలా తమను తాము నిరూపించుకోవాలని అనుకుంటారు. నేల విడిచి సాము చెయ్యడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు మాత్ర మింగాల్సి వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి చేదు గుళికలను రుచి చూశారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

సుడిగాలి సుధీర్ ఈమధ్యే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమా తో హీరోగా తన అదృష్టం పరిక్షించుకున్నాడు. అయితే ఈ సాఫ్ట్ వేర్ బాబు బోరింగ్ గా ఉండడంతో పట్టించుకునేవారు లేక చతికిలపడింది. జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ కు మంచి క్రేజ్ వచ్చింది కదా.. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని నిర్మాతలు ట్రై చేశారు కానీ వర్క్ అవుట్ కాలేదు. కొన్ని సెంటర్లలో సినిమాకు పోస్టర్ల ఖర్చు కూడా రాలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలామందికి ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలీదని చెప్తున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన సినిమాల్లో తమ సినిమాలు హిట్ అని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు కానీ నిజంగా హిట్ అయినవి మాత్రం ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే’ మాత్రమే.

కమెడియన్లు ఇలా హీరో గా సినిమా చేసే సమయంలో డ్యాన్సులు.. రొమాన్సులు.. ఫైట్లు.. అంటూ ఎప్పటిలాగే కమర్షియల్ ఉప్మా కాకుండా వేరే ఏదైనా వెరైటీ డిష్ ట్రై చేస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. పెద్ద హీరోల సినిమాలకే కమర్షియల్ ఫార్మాట్ వర్క్ అవుట్ కావడం లేదు.. మరి కమెడియన్లు కూడా అదే ఫార్మాట్ ఫాలో కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం ఎందుకు అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Please Read Disclaimer