స్క్రిప్ట్ ఇంకోసారి రాస్తున్న బోయపాటి?

0

నటసింహ నందమూరి బాలకృష్ణ కు 2019 అసలు కలిసి రాలేదు. సినిమాలు జస్ట్ ఫ్లాప్ అయితే పెద్ద సమస్య కాదు కానీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా డిజాస్టర్లు కావడంతో బాలయ్య మార్కెట్ దెబ్బతిన్నదనే సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. ముఖ్యంగా డిసెంబర్లో విడుదలైన ‘రూలర్’ సినిమాకు బాలయ్య అభిమానుల నుంచి కూడా పెద్దగా మద్దతు లభించలేదని కూడా కొందరు అన్నారు. ఈ పరిణామాలు బాలయ్య కొత్త సినిమాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం.

‘రూలర్’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించాల్సి ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సం కూడా జరుపుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అనుకున్న సమయంలో ‘రూలర్’ ఫలితం ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని.. దీంతో ఒక్కసారిగా ఫిలిం మేకర్స్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బాలయ్య – బోయపాటి సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే. అందుకే నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ బడ్జెట్ ను తగ్గించాలని కోరారట. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు కూడా జరిగాయట.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం మరోసారి రాస్తున్నారట. సవరించిన బడ్జెట్ ప్రకారం సినిమా స్క్రిప్టును మారుస్తూ.. మరింత పకడ్బందీగా ఉండేలా తయారు చేస్తున్నారట. బాలయ్యకే కాకుండా తనకు కూడా విజయం ఎంతో కీలకం కావడంతో ఈ సినిమా ఎటువంటి పరిస్థితిలో అయినా హిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ లో పూర్తిగా మార్పుచేర్పులు చేసిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.
Please Read Disclaimer