మతాన్ని కించపరిచిన `బ్రా` బ్యూటీ..

0

సోషల్ మీడియా పిచ్చి పీక్స్ కి చేరిన ఈ ట్రెండ్ లో పబ్లిసిటీకి కొదవేమీ లేదు. ఒక్క ఫోటో చాలు వైరల్ అయిపోవడానికి. లక్షలాది మంది లైక్ లు.. షేర్లతో హీటెక్కించేస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకునేందుకు సెలబ్రిటీలు ఎంతకైనా బరి తెగిస్తున్నారు. టాప్ మోడల్స్ సహా అందాల కథానాయికలు ఈ అవకాశాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా టాప్ లేపేస్తున్నారు.

నిరంతరం `కాన్సెప్ట్` అంటూ వేడెక్కించే ఫోటోషూట్లను సోషల్ మీడియాలైన ట్విట్టర్-ఎఫ్.బి- ఇన్ స్టాగ్రమ్ వేదికలపై షేర్ చేస్తూ ప్రమోషన్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు. అదే కోవలో గత కొంతకాలంగా `ఆహా కళ్యాణం` బ్యూటీ వాణీ కపూర్ తన ఫోటో షూట్లను రెగ్యులర్ గా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు యశ్ రాజ్ ఫిలింస్ పర్మినెంట్ సోల్ గా పాపులరైంది. బ్లాక్ బస్టర్ `బ్యాండ్ బాజా బారాత్` తో మొదలైన అనుబంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

ఆ సినిమాలో నటించింది మొదలు నాటి నుంచి ఇదే బ్యానర్ లో వరుసగా సినిమాలకు కమిటవుతూ ఉంది. ఇటీవలే వార్ చిత్రంతో పాన్ ఇండియా రేంజులో బరిలో దిగింది. వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు కొట్టేయడంతో ఇక ఇదే అదనుగా తనకు తానుగా ప్రచారాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లింది వాణీ. వార్ చిత్రంలో పోల్ డ్యాన్స్ .. యోగా ట్రిక్స్ అంటూ వాణీ అందాల ఆరబోత కుర్రకారుకు కిక్కు తెప్పించింది. అందుకే ఇప్పుడిలా ఆ ఇమేజ్ ని చెదరనివ్వకుండా మరింతగా ప్రచారానికి దిగుతోంది.

ఇటీవలే సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసి కొంత సమయం తర్వాత దానికి తొలగించింది. అందుకు కారణమేంటో తెలీదు కానీ.. ఆ ఫోటో మాత్రం క్షణాల్లో వైరల్ అయిపోయింది. అలాగే దానికి వాణీ కపూర్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. `రామ్` అనే అక్షరాలతో ప్రింట్ చేసిన స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ ని ధరించిన వాణీ అందులో అందాల్ని ఆరబోసింది. దీంతో ఆ ఫోటో చూసిన హిందూవాదులు ట్రోల్స్ తో చెలరేగారు. ఆ దెబ్బకు వెంటనే ఆ ఫోటోని తొలగించింది. అయితే వాణీ టైమ్ చూసి టెంప్ట్ చేసే పని పెట్టుకుందా ఏమో కానీ.. ఓవైపు సుప్రీంలో `అయోధ్య రామ మందిరం` వివాదంపై తీర్పు వెలువరించిన క్రమంలో వాణీ ఇలా డిజైనర్ ఫోజులిచ్చి చెలరేగింది. దీంతో ఇదేదో తేడా వ్యవహారమేనని నెటిజనులు కనిపెట్టి ట్రోల్స్ చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే కల్చర్ వల్లనే తనకు పాపులారిటీ పెంచుకోవాలని వాణీ అనుకుందా? లేక యాథృచ్ఛికంగా జరిగిపోయిన తప్పును సరిదిద్దుకుందా? అన్నది అటుంచితే ఫోటోని తొలగించిన ఈ అమ్మడు ఎఫ్.బి – ట్విట్టర్ లో డీపీ (అదే ఫోటో)ని మాత్రం తొలగించలేదు.. ప్చ్!! దీంతో ప్రస్తుతం వాణీ గూగుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక్కడ తిట్టేవాళ్లతో పాటు పొగిడేవాళ్ల ఆశీస్సలు అందుకుంది మరి. అయితే ఇంత జరిగినా వార్ తర్వాత ఈ అమ్మడికి వేరొక ఆఫర్ వచ్చింది అన్న సమాచారం అయితే లేదు మరి.. !!
Please Read Disclaimer