భయంతో డైరెక్టర్ బుచ్చిబాబు సాన..!

0

మెగా ఫ్యామిలీ నుంచి నటవారసుడు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ .. కన్నడ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన` డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. ఈ మూవీ టీజర్.. ట్రైలర్.. సాంగ్ ప్రోమోస్ ప్రతిదీ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.

`ఉప్పెన` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ నిన్న రాత్రి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో తాజాగా వైరల్ గా మారింది. “ఉప్పెన డబ్బింగ్ టైమ్ ఇది. భయంతో డైరెక్టర్ బుచ్చిబాబు సాన“ అంటూ ఫన్నీగా ఉండే ఓ ఫోటోని షేర్ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు ఫేస్ షీల్డ్ .. ఫేస్ మాస్క్ ధరించి కనిపిస్తున్నాడు. కోవిడ్ 19 భయాందోళనల ప్రభావమిదని బ్రహ్మాజీ ఎంతో ఫన్నీగా చెప్పడం కనిపిస్తోంది.

బ్రహ్మాజీ ప్రచారం బావుంది. ఇక చిత్రయూనిట్ పూర్తిగా ప్రచారబరిలో దిగనుందని తెలుస్తోంది. ఉప్పెనను సుకుమార్ రైటింగ్స్ … మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.