మరో వారసుడు ఎంట్రీ

0

టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. ఎంతో మంది వారసులు ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే కొద్ది మంది మాత్రమే తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వారసత్వంతో మరో హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. తెలుగు కమెడియన్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈయన హీరోగా మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.

కొన్నాళ్ల వరకు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ గా చేసిన సంజయ్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ కు సంబంధించిన విషయాలు కాని.. సినిమా వివరాలు కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా వెళ్లడించిందే లేదు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తర్వాత అమలాపురం వెళ్లనున్నారు.

అమలాపురంలో మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం అందుతోంది. బ్రహ్మాజీ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘నేనే తోపు రా’ చిత్రంలో నటించిన నిత్య శెట్టి కనిపించబోతుంది. ఈ చిత్రంను ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ తన భవ్య క్రియేషన్స్ లో నిర్మిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలను అందించిన భవ్య ప్రసాద్ ఈ చిత్రంతో బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కి సక్సెస్ ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ చిత్రంతో చందు మొద్దు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఎంతో మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు బ్రహ్మాజీ వారసుడిగా సంజయ్ రాబోతున్నాడు. ఈయన ఏ స్థాయిలో సత్తా చాటేనో మరి..!
Please Read Disclaimer