బ్రహ్మీలో ఆ కొంటెతనమే వేరు

0

స్టార్ డైరెక్టర్లకు అత్యంత ప్రీతిపాత్రుడు బ్రహ్మీ. పూరి-త్రివిక్రమ్- శ్రీనువైట్ల సహా పలువురు టాప్ రేంజ్ డైరెక్టర్లు బ్రహ్మానందం కోసమే ప్రత్యేకించి పాత్రల్ని పుట్టించారు. ఆయనతో ఎన్నో అద్భుతాలు చేయించారు. అయితే కాలం మారింది. కాలంతో పాటే మార్పు కనిపిస్తోంది. బ్రహ్మీ తెరవెనక్కి వెళ్లిపోయాడు. ఇటీవలి కాలంలో ఆరోగ్యం కూడా ఆయనకు సహకరించకపోవడంతో నటనకు కాస్త దూరం జరిగినట్టే అనిపిస్తోంది.

ఇకపోతే బ్రహ్మానందం నటనకు దూరమవ్వడానికి అదొక్కటే కారణం కాదు. అంతా ప్రచారం చేసినట్టు ఆయనకు అవకాశాల్లేక నటించడం మానేయలేదు. గత కొన్నాళ్లుగా.. తన వద్దకు తెచ్చే ప్రతిదీ ఏ స్ఫూఫ్ నో లేకపోతే ఇంతకుముందు చేసేసిన తరహానో .. అందుకే సెలక్టివ్ గానే ఎంపిక చేసుకుంటున్నానని బ్రహ్మీ స్వయంగా వెల్లడించారు. కారణం ఏదైనా ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

అయితే కొంత గ్యాప్ తర్వాత త్రివిక్రముడే పూనుకుని బన్నీని మరోసారి బరిలో దించేస్తున్నారు. త్రివిక్రమ్ తో బ్రహ్మీ కాంబినేషన్ అనగానే.. `అతడు` సినిమాలో మైమరిపించే కామెడీ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ బ్రహ్మీకి ఒక పాత్ర తప్పనిసరి. తాజా చిత్రం అల వైకుంఠపురములోనూ బ్రహ్మీ ఓ పాటలో తళుక్కున మెరుస్తాడట. బ్రహ్మీ కనిపించేది కొద్దిసేపే అయినా కడుపు చెక్కలయ్యేలా నవ్వించగలడు. ఇంతకుముందు బ్రహ్మీకి శస్త్ర చికిత్స జరిగిన అనంతరం ముందుగా కలుసుకున్నది బన్నీ. లేటెస్టుగా మరోసారి బన్ని- బ్రహ్మీనందం కాంబినేషన్ ఫోటో ఒకటి అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో బ్రహ్మీ ఇంకా అదే ఎనర్జీతో కొంటెతనంతో కనిపిస్తున్నారు. ఆయనలోని ఈ యాటిట్యూడ్ వందశాతం శ్రీరామరక్ష అని చెప్పాలి.
Please Read Disclaimer