బిత్తిరిసత్తి బుగ్గలను బ్రహ్మానందం ఎందుకు నిమిరాడంటే!

0

ఔనండి. వెండితెరపై తన హాస్యంతో అశేష అభిమానులను కలిగి ఉన్న బ్రహ్మానందం…బుల్లితెరపై ప్రత్యేక కార్యక్రమం ద్వారా లక్షలాది మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న రవికుమార్ అలియస్ బిత్తిరి సత్తి కలిశారు. ఇటీవలే హీరోగా సినీరంగంలోకి ప్రవేశించిన బిత్తిరి సత్తి…ఓ రాజకీయ నేత కార్యక్రమం కోసం…బ్రహ్మానందంతో సమావేశం అయ్యారు. అంతేకాదు…ఆయనకో సవాల్ కూడా విసిరారు. ఎవరా రాజకీయవేత్త అంటే…తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నమ్మినబంటు అయిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రముఖులు మూడు మొక్కలు నాటి…మరో ముగ్గురికి ఆ మేరకు సవాల్ విసిరాలనే లక్ష్యంతో…ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ చేపట్టారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొక్కలు నాటి బిత్తిరిసత్తికి చాలెంజ్ విసిరారు. దీన్ని స్వీకరించిన ఈ రోజు మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా మరో నలుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హాస్య నటుడు బ్రహ్మానందం – ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్ష్ రావు – సినీనటుడు ప్రియదర్శిని – తీన్మార్ శివ జ్యోతి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

కాగా ఈ సవాల్ నేపథ్యంలో..బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన బిత్తిరి సత్తి ఆయనకు మొక్కను అందించారు. ఈ చాలెంజ్ గురించి వివరించారు. సత్తిని సాదరంగా ఆహ్వానించిన బ్రహ్మానందం ఆయన బుగ్గలు నిమిరి తన మమకారాన్ని చాటుకున్నారు. ఇదండి…బుల్లితెర-వెండితెర ప్రముఖుల భేటీ విశేషం.
Please Read Disclaimer