బ్రేకప్ గతం.. ర్యాంప్ వాక్ ప్రస్తుతం!

0

గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్య సినిమాల్లో నటించడం కంటే పర్సనల్ లైఫ్ విషయంలో ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పడంతో అది హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ఒక లవ్ జంట విడిపోతే పెద్దగా షాక్ తినరు కానీ ఈ జంట రాగం తాళం వేరు. అసలు వీరిని జనాలు లవర్స్ అనుకోలేదు. సీక్రెట్ మ్యారేజ్ అయిపోయింది.. ఇద్దరూ భార్యాభర్తలు అనుకున్నారు. అందుకే బ్రేకప్ న్యూసుకు షాక్ అయ్యారు.

అయినా కాలం అన్ని గాయాలని మాన్పుతుంది. అందుకే ఇల్లీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటి రెండురోజుల్లోనే తన బ్రేకప్ గాయాలను మర్చిపోయి రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేసింది. తన ఇన్స్టా ఖాతా ఫోటోలు చూస్తే ఎవరికైనా ఆ విషయం అర్థం అవుతుంది. ఓ వారం క్రితం కత్తిలాంటి బికినీ ఫోటోతో జనాలను థ్రిల్ చేసింది. జస్ట్ ఫోటోలే కాదు.. ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటూ ర్యాంప్ వాక్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ముంబైలో బాంబే రియాల్టీ వారి ఆధ్వర్యంలో ఒక ఫ్యాషన్ షో జరిగింది. షోలో బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అతిథుల మతులు పోగొట్టింది. ఎంబ్రాయిడరీ ఉండే బ్లాక్ కలర్ ఛోళి.. అదే రకమైన లెహెంగా.. ఒక దుపట్టాతో.. బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ హొయలుపోతూ నడిచింది. ఈమధ్య బ్రేకప్ తర్వాత ఫిట్నెస్ పై ఫుల్లుగా ఫోకస్ పెట్టడంతో ఫిట్ గా తయారైంది. దీంతో ఆ డిజైనర్ డ్రెస్ లో అందాలబొమ్మలా కనిపించింది.

ఇక ఇలియానా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్ పంటి’ లో నటిస్తోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్.. జాన్ అబ్రహం..అర్షద్ వార్సి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ‘ది బిగ్ బుల్’ అనే మరో హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer