మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ.. కేంద్ర మంత్రి ఇన్వాల్వ్‌మెంట్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పొలాచ్చిలో జరుగుతోంది. మహేష్‌బాబుతో పాటు రష్మిక, రావు రమేష్, సంగీత తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే, ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక షెడ్యూల్‌ను కశ్మీర్‌లో జరిపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారు కాబట్టి.. దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. అయితే, ఈ షెడ్యూల్ చేయడానికి యూనిట్ చాలా కష్టపడిందట. ఆ సమయంలో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రేపే మాపో రద్దు చేయడం ఖాయమనే ప్రచారం జమ్మూ కశ్మీర్‌లో మొదలైంది. అలాంటి సమయంలో అక్కడ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ జరపాల్సి వచ్చింది.

అయితే, ఈ సినిమా చిత్రీకరణకు ముందస్తు అనుమతులు తీసుకున్నారట. నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సాయం తీసుకున్నారట అనిల్ సుంకర-మహేష్ బృందం. మహేష్‌కి ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటుచేసినట్టు సమాచారం. అంతేకాదు, వేకువజామును 5 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు మాత్రమే షూటింగులకు అనుమతించారట. అలా జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 4వ తేదీకల్లా షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆగస్టు 5వ తేదీన అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆంక్షలు విధించారు.

ఆర్టికల్ 370ని రద్దుచేసిన తరవాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కశ్మీర్‌లో సినిమా షూటింగ్‌ల గురించి మాట్లాడారు. ఇకపై కశ్మీర్‌లో షూటింగ్ జరపాలంటే ఏ హీరో, దర్శక నిర్మాతలు భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. అన్ని సినీ పరిశ్రమలకు చెందినవారు ఇక్కడికి వచ్చి షూటింగ్‌లు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తామని కూడా అన్నారు. కానీ, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి ముందే మహేష్ బాబుకు సాయం చేసింది కేంద్ర ప్రభుత్వం.
Please Read Disclaimer