పుష్ప తర్వాత బన్నీ బాలీవుడ్ ప్లాన్స్?

0

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం పుష్ప. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. బన్నీ.. సుకుమార్ లు ఇద్దరు కూడా గత చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ దక్కించుకున్నారు. కనుక వీరిద్దరి కాంబోలో ఈసారి అంతకు మించిన సినిమా వస్తుందని అంతా భావిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళం.. మలయాళం.. కన్నడం.. హిందీ భాషల్లో కూడా బన్నీ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రంను హిందీలో చేయాలని భావిస్తున్నాడట. పుష్ప చిత్రం హిందీలో సక్సెస్ అయితే హిందీ.. మలయాళంలో ఒక డైరెక్ట్ సినిమాను చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం ఇప్పటి నుండే చర్చలు జరుపుతున్నాడు.

పుష్ప చిత్రం విడుదల తర్వాత ఆ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుకుమార్ ప్రాజెక్ట్ అంటే బాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అందుకే ఖచ్చితంగా బన్నీ వచ్చే ఏడాది కాకున్నా 2022 సంవత్సరంకు అయినా బాలీవుడ్ కు బన్నీ వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. చాలా కాలంగా మలయాళంలో ఒక డైరెక్ట్ సినిమాను చేయాలని ఆశపడుతున్నాడు. కాని అది సాధ్యం అవ్వడం లేదు. కనీసం హిందీ సినిమా అయినా పట్టాలెక్కేనా చూడాలి.
Please Read Disclaimer