వైకుంఠపురం నుండి బయటకు వచ్చేయ్ బన్నీ!!

0

అల్లు అర్జున్ సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బన్నీ కూడా ఊహించనంత పెద్ద సక్సెస్ అయ్యింది. మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తే ఏకంగా ఇండస్ట్రీ దక్కిందంటూ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ లో ఇన్నేళ్లకు ఇండస్ట్రీ హిట్ దక్కడంతో బన్నీ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. వరుసగా పార్టీలు ఇస్తూ సక్సెస్ ను ఇతరులతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

గత రెండు వారాలుగా బన్నీ వరుసగా పార్టీల మీద పార్టీల్లో మునిగి తేలుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సుకుమార్ కు బన్నీ అసహనం కలిగేలా చేస్తున్నాడట. బన్నీ 20వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్ ను జనవరి చివరి వారంలో మొదలు పెట్టాలని సుకుమార్ భావించాడట. కాని బన్నీ పార్టీ మూడ్ లో ఉండి సుకుమార్ కు డేట్లు ఇవ్వడంలేదట.

ఇప్పటికే రెండవ షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయడం జరిగిందట. ఫిబ్రవరి రెండవ వారంకు రీ షెడ్యూల్ చేసిన సుకుమార్ ఆ తేదీకి అయినా బన్నీ వస్తాడా లేదా అనే అనుమానంలో ఉన్నాడట. సుకుమార్ రంగస్థలం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బన్నీ 20 చిత్రాన్ని చేస్తున్నాడు. సినిమా మొదలైన తర్వాత కూడా ఇలా ఆలస్యం చేస్తుండటం తో సుకుమార్ లో లోపల చిరాకు పడుతున్నట్లు గా గుస గుసలు వినిపిస్తున్నాయి.

సుకుమార్ ఈ చిత్రాన్ని దసరా కంటే ముందే విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. కాని బన్నీ మాత్రం వైకుంఠపురంలోనే మునిగి తేలుతున్నాడని.. ఇప్పటికైనా వైకుంఠపురం నుండి బయటకు రావాలంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ బన్నీని కోరుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-