నాలుగింటికి బన్నీ… ఐదింటికి మహేష్

0

సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ‘అల వైకుంఠపురములో”సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఇప్పుడు ప్రమోషన్స్ తో కూడా పోటీ పడుతున్నాయి. అవును ఇప్పటికే ఒకే రోజు రిలీజ్ అంటూ ప్రకటించేసారు. అయితే మళ్ళీ ఒక రోజు ముందుకు వెనక్కి అనే డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్ గా అల వైకుంఠపురములో మంచి ప్రమోషన్స్ తో ముందుంది. ఇప్పటికే రెండు పాటలు కూడా వదిలేసారు. ఈ రోజు మూడో పాటను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు.

అందుకు నాలుగింటికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇక బన్నీ సాంగ్ రిలీజైన గంటకే అంటే ఐదింటికిమహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వస్తుంది. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు సాంగ్ టీజర్ తో హల్చల్ చేయబోతున్నాయి.

బన్నీ సాంగ్ కి సంబంధించి ఇప్పటికే కొంత లీక్ వదిలారు. అందరూ సాంగ్ విన్నారు. కాకపోతే పూర్తి సాంగ్ ను ఇవ్వాళ రిలీజ్ చేస్తున్నారు. ఇటివలే అల్లు అర్జున్ పిల్లలిద్దరూ ఆ సాంగ్ టీజర్ లో మెరిసి అందరినీ అలరించారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ ని బట్టే సినిమాపై హైప్ వచ్చే చాన్స్ ఉంది.
Please Read Disclaimer