లారీ స్టీరింగ్ పట్టిన బంటు

0

అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ 20వ చిత్రం తదుపరి షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ గత రెండు మూడు రోజులుగా లారీ డ్రైవింగ్ కు ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే కారు డ్రైవింగ్ వస్తుంది కనుక బన్నీ లారీ డ్రైవింగ్ చేసేందుకు పెద్దగా ఇబ్బంది పడటం లేదని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి లారీ స్టీరింగ్ పట్టి బన్నీ ఎలా ఉంటాడా అంటూ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో రామ్ చరణ్ ను పల్లెటూరు చెవిటి కుర్రాడి పాత్రలో చూపించిన సుకుమార్ ఈసారి బన్నీని లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో చూపించబోతున్నాడు.

నోట్లో బీడీ.. లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలకు గాను జగపతిబాబు మరియు విజయ్ సేతుపతిలను ఇప్పటికే ఎంపిక చేసిన సుకుమార్ హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రంగస్థలం చిత్రం తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ రావడంతో దర్శకుడు సుకుమార్ చాలా కసితో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా బన్నీకి మరో ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డు ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-