సౌత్ ఇండియా సోషల్ మీడియా రారాజు బన్నీ

0

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ మద్య స్టార్ హీరోల స్టామినాను వారి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య నిరూపిస్తుంది. స్టార్ హీరోలు ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ ల్లో ఖాతాలు కలిగి ఉన్నారు. విడి విడిగా చూసుకుంటే ఒకొక్క సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఒక్కరు టాప్ లో ఉంటారు. అన్నింటిని కలిపి లెక్కిస్తే టాప్ లో నిలిచింది మాత్రం అల్లు అర్జున్. మూడింట్లో కలిపి అల్లు అర్జున్ కు ఏకంగా 34 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ సౌత్ లో మరే హీరోకు లేదు అనడంలో సందేహం లేదు. ఆయన తన ఫాలోవర్స్ సంఖ్యతో రికార్డును సృష్టించాడు.

ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న విజయ్ దేవరకొండ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో బన్నీని మించలేక పోయాడు. ఆ కారణంగా ఓవరాల్ కౌంట్ లో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడు. బన్నీ డబ్బింగ్ సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ దక్కించుకున్నాయి. అందుకే ఆయనకు ఈ స్థాయిలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ ఆ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఆ సినిమా హిట్ అయితే బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 50 మిలియన్ ల వరకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.