బామ్మతో బన్నీ క్వారంటైన్ టైమ్

0

కరోనా కారణంగా సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంతా కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. సినిమా స్టార్స్ ఎప్పుడు కూడా షూటింగ్స్ లేదా ఇతరత్ర కార్యక్రమాలతో చాలా బిజీ బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులతో తక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉండేవారు. కాని ఇప్పుడు కరోనా కారణంగా ఎవరికి వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు. ప్రభుత్వాలు క్వారంటైన్ లైఫ్ ను గడపాలంటూ సూచిస్తున్న నేపథ్యంలో దాదాపు అందరు సెలబ్రెటీలు కూడా అదే మెయింటెన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా కోసం కేరళలో చిత్రీకరణలో ఉండాలి. కాని కరోనా కారణంగా కేరళ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశారు. దాంతో బన్నీ ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ సందర్బంగా తన నానమ్మ(అల్లు రామలింగయ్య గారి భార్య) తో టైం స్పెండ్ చేశాడు. కుటుంబ సభ్యులు అంతా కలిసి సరదాగా టైంను గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ తాజాగా ఈ ఫొటోను పోస్ట్ చేశాడు.

నానమ్మ ముద్దు పెడుతున్న ఈ బ్యూటీఫుల్ పిక్ ను షేర్ చేసిన బన్నీ ప్రియమైన వారితో క్వారంటైన్ లైఫ్ చాలా మంచి అనుభూతిని పొందుతున్నాం అంటూ క్యాప్షన్ పెట్టాడు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే బన్నీ ఇలా మొదటి సారి నానమ్మతో తీసుకున్న ఫొటోను షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా దాదాపు అందరు స్టార్స్ కూడా వారి వారి ప్రియమైన వారితో క్వారంటైన్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరోనా వల్ల ఇదొక ప్రయోజనం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-