ఆర్య 2 పదో వార్షికోత్సవంపై బన్ని

0

అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరు ఎలా వచ్చింది? అంటే అందుకు కారణం `ఆర్య` సిరీస్ అనడంలో సందేహం లేదు. బన్నీని అత్యంత స్టైలిష్ గా ఎలివేట్ చేసిన డైరెక్టర్ గా సుకుమార్ కి పేరొచ్చింది. నేడు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నారంటే సుక్కూ క్రియేట్ చేసిన ఆర్య పాత్ర వల్లనే. పూరి- దేశముదురు పక్కా మాస్ అండ్ స్టైలిష్ హీరోగా ఎలివేట్ చేస్తే ఆ స్థాయిని ఆర్య 2 మరో లెవల్ కి తీసుకెళ్లింది.

అందుకే ఆర్య – ఆర్య 2 చిత్రాల్ని బన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. నేటి(నవంబర్ 27)తో ఆర్య 2 రిలీజై పది సంవత్సరాలైంది. ఈ సందర్భంగా పదో యానివర్శరీని బన్ని ప్రస్థావిస్తూ కాస్త ఎమోషన్ అయ్యారు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన సుకుమార్ కి కృతజ్ఞతలు చెప్పాడు బన్ని. ఆర్య 2 కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా బన్ని నటించిన స్టైలిష్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఆల్వేస్ ట్రెండింగ్. ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె ఏమిటో.. పాట ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఈ పాటలో కొన్ని లైన్లు బన్ని ఆలపించారు. అందుకే ఈ సినిమాతో బన్ని ఎంతో ఎమోషనల్ గా కనెక్టయ్యాడు. ప్రాణం పోయినా.. మర్చిపోలేడనంత ప్రేమ సుక్కూ అంటే.. బన్నికి..
Please Read Disclaimer