బన్నీకి రంగస్థలం టైప్ మేకోవర్?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కే సమయం రావడంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి.

ఈ సినిమా శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఈ స్మగ్లింగ్ వ్యవహారాలను చూసుకునే వ్యక్తి పాత్ర పోషిస్తున్నాడట. అయితే ఈ పాత్ర ‘రంగస్థలం’ లో చరణ్ పోషించిన చిట్టిబాబు తరహాలో నాటుగా ఉంటుందట. సినిమాలో మెజారిటీ భాగం బన్నీ లుంగీ బనియన్లోనే కనిపిస్తాడట. అంటే బన్నీ తన కెరీర్లో ఇలా పూర్తిస్థాయిలో రగ్డ్ గా నటించడం ఇదే మొదటిసారి అవుతుంది. అల్లు అర్జున్ కు మొదటి నుంచి స్టైల్ కు పెట్టింది పేరు.. ప్రతి సినిమాకు హెయిర్ స్టైల్.. డ్రెసింగ్ లో ఏదో ఒక వైవిధ్యం చూపించడం వల్లే అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ మొరటు గెటప్ లో ఎలా ఉంటాడో చూడాలి.

ఈ మేకోవర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాను రేపే లాంచ్ చేస్తున్నారని.. డిసెంబర్లో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.
Please Read Disclaimer