ఫ్రెండు తప్పిదం వల్లనే బన్నీకి ఆ డిజాస్టర్!

0

బన్ని వాసు… పేరులోనే అర్థం అంతరార్థం ఇమిడి ఉంది. అల్లు కాంపౌండ్ లో అందరికీ ఆప్తుడు.. మిత్రుడు. గీతాఆర్ట్స్ 2 అనే బ్యానర్ ని స్వయంగా అప్పగించారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక బన్నీ క్లోజ్ ఫ్రెండు. ఎంత మంచి ఫ్రెండు అంటే తన పేరు ముందే బన్ని ని యాడ్ చేసేంతగా. ఏలూరు నుంచి వచ్చిన బన్నీవాసు అనతి కాలంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అత్యంత ఆప్తమిత్రుడయ్యారు. బన్నికి సర్వస్వం తనే. ఎంతగా అంటే బన్ని ఎంపికల్లో తను ఉండాల్సిందే. కథ ఎంపికలోనూ బన్నీవాసు చెప్పింది అల్లు అర్జున్ ఫైనల్ చేసేస్తుంటారు. అయితే అంత మంచి స్నేహితుడి కారణంగా అల్లు అర్జున్ బిగ్ ఫ్లాప్ చిత్రంలో నటించాల్సి వచ్చిందట. తనకు తెలిసీ ఆ తప్పును చేయాల్సి వచ్చిందన్న నిజం తాజాగా బయటపడింది.

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`.. కథ విన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఎక్కడో తేడా కొడుతోంది! అని పదే పదే చెబుతూనే వున్నారట. కానీ బన్నీ క్యారెక్టరైజేషన్ మీద కాన్సన్ ట్రేట్ చేసిన బన్నీ వాసు బాగుంటుందని చెప్పడంతో తనని నమ్మిన బన్ని `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాని చేశాడట. అది తాను చేసిన తప్పేనని.. నేను నిర్మాతగా బిజీ కావడం వల్లే బన్నీకి కొంత దూరమయ్యానని.. ఆ గ్యాప్ వల్లే బన్నీ ఫ్లాప్ చూడాల్సి వచ్చిందని బన్ని వాసు అన్నారు. బన్ని నెక్ట్స్ సినిమా విషయంలో గ్యాప్ తన వల్లనే ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` వాట్ నెక్స్ట్ …ఇలా వరుసగా ఫ్లాప్ కావడంతో అల్లు అరవింద్ పిలిచి `పట్టు తప్పుతున్నావ్` అని మందలించారట. ఆ టైమ్ నాకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిందని.. దాంతో కొంత సమయం తీసుకుని పరశురామ్ తను చాలా శ్రమించామని.. తిరిగి `గీత గోవిందం`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాక అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్లి మళ్లీ ఫామ్ లోకి వచ్చానని కాలర్ ఎగిరేసినంత పని చేశానని చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer