బన్నీ వాచ్…. రీజన్ ఏంటి ?

0

బన్నీ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘అల వైకుంఠపురములో’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఓ పాటను అలాగే కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. అయితే సినిమాలో బన్నీ లుక్ తో పాటు చేతికి ఉన్న వాచ్ కూడా ఏదో సందేహం కలిగిస్తుంది. నిజానికి ఈ సినిమాలో బన్నీ హెయిర్ స్టైల్ ఒకప్పటి హీరోల లుక్ ను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా నాగ్ ఒకప్పటి హెయిర్ స్టైల్ ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా పీరియాడిక్ కాదు కాబట్టి ఒకప్పటి హెయిర్ స్టైల్ ను జస్ట్ బన్నీ మళ్ళీ రిపీట్ చేసాడని అనుకోవచ్చు.

కానీ బన్నీ చేతికున్న వాచ్ కి మాత్రం సినిమాలో ఏదో ‘కీ’ ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో ఏ చిన్న వస్తువుని తక్కువ చేయలేం. వాటికో ఏదో ఒక మీనింగ్ ఉండేలా చూసుకుంటూ డిజైన్ చేసుకుంటాడు. నిజానికి బన్నీ వాచ్ ఇప్పటి స్టైల్ కి పొంతన లేనంత తేడా ఉంది. అప్పుడెప్పుడో వాడే వాచ్ ని తగిలించుకున్నాడు స్టైలిష్ స్టార్.

పైగా ప్రతీ పోస్టర్ లో ఆ వాచ్ ఎలివేట్ అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన మలయాళం పోస్టర్ లో కూడా బన్నీ చేతి వాచ్ హైలైట్ అయింది. అందుకే ఈ చర్చ నడుస్తుంది. మరి సినిమాలో బన్నీ వాచ్ కి గురూజీ ఏదైనా క్లారిటీ ఇచ్చే సన్నివేశం కానీ మీనింగ్ తెలిపే పని కానీ చేస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer