ఆర్ ఆర్ ఆర్ లో అవి కూడా హైలైట్ కానున్నాయా…??

0

అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే ఆర్ఆర్ఆర్ నుండి మరో అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ రోల్ చేస్తుండగా రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ చిత్రీకరించిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేస్తున్నారట. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమాను ఎలా బ్యాలన్స్ చేసి అభిమానులను మెప్పిస్తాడో చూడాలని అందరూ ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య లీక్ అయిన ఎన్టీఆర్ పులితో పోరాడే సీన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్స్ చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేసాయి.

ఇదిలావుండగా ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ లు ఒక రేంజ్ లో ఉంటాయని సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా ఉంటాయని తెలుస్తోంది. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకోరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-